అబలలు కారు

Not a abala వాళ్లను కాదు
నగంగా మీ ద్వేషాన్ని…,
మీ కామాన్ని ఊరేగించారు

వాళ్లు కాదు
మీ మగత్వం, మీ బరితెగింపు
బలహీనం

ఇది కదా..
మీ ఆధిక్యతా ప్రదర్శన?
ఇంత హేయాతి హేయం కదా..
మీ అహంభావ ప్రకటన?

థూ..!
అత్యంత అల్పమైన
నీచమైన
ఈ తోవన పడి
మీరు చేరే గమ్యం ఏది?
క్రూరమైన గుంపు గుత్తగా
సాధించే లక్ష్యమేది?

మీ నైచ్యాన్ని కాదు
ఇప్పుడు నగంగా
ప్రపంచ వీధిన
విశ్వగురువుగా చాటిన దేశాన్ని
అనుసరణీయమన్న సంస్కతిని
ఊరేగిస్తున్నారు

బలహీనత
మీ అహంకారానిది కాదు
అసమర్థ సమర్థనది
అర్ధాంగీకారానిది
దాని తుప్పట్టిన తాళాన్ని
బద్దలు కొట్టిన
ఆ ఇద్దరు అబలలు కారు
అసలైన బలవంతులు
– మడిపల్లి రాజ్‌కుమార్‌
99496 99215