సమస్యలు పరిష్కారానికి సమరశీల పోరాటం..

– అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– నిజామాబాద్‌కు చేరుకున్న జీపు జాతా
నవతెలంగాణ-కంఠేశ్వర్‌/ఆర్మూర్‌
ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే సమరశీల పోరాటమే మార్గమని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త జీపు జాతా సోమవారం నిజామాబాద్‌ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నాచౌక్‌లో జరిగిన సభలో పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ రక్షణ, అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేల సాధన, 45వ ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ సిఫార్సుల ప్రకారం పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు జరపాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 16 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్త జీపు జాతా చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమానికి సన్నద్ధం చేయనున్నట్టు చెప్పారు.అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారం పెంచుతూ నిత్యం నరకయాతన పెడుతున్నారని, వేతనాలు మాత్రం సరిపడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ వంట గ్యాస్‌ ధరలు పెంచారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2018లో పెంచిన వేతనాలు అమలు జరపకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. 2022లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులకు 1972 చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టలేదని, 2017 నుంచి టీఏ, డీఏలు చెల్లించడం లేదని, ఆన్‌లైన్‌లో అనేక యాప్‌లను పెట్టి పనిభారాన్ని పెంచిందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సునీత, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.రమేష్‌ బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేవగంగు, పి.స్వర్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, నాయకులు పి.చంద్రకళ, మంగాదేవి, శివరాజమ్మ, పి.వాణి. రాజ సులోచన, సూర్య కళ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:26):

average blood sugar test name Q6c | how to check your UPG dogs blood sugar | does quitting smoking affect your blood WLJ sugar | can high blood sugar make you miss your period EwS | gan fasting blood sugar pregnant | blood sugar 193 after eating Tix | vyvanse eim and low blood sugar | LV5 best way to burn blood sugar | what number is your blood sugar mmol lsupposed ucI to be | what is dangerously low blood sugar level 2Og | how do you reduce your uGJ blood sugar level | metformin for HgO blood sugar imbalance | fasting blood sugar 4Ys level 115 mg dl | bIK giving dogs cat food low blood sugar | blood sugar is gmn 55 | how long does it take blood sugar to J6D lower | cinnamon supplements to hCw lower blood sugar | 110 on blood R7e sugar test | cgm 7H6 blood sugar monitoring | whats a dangerous QK9 low blood sugar | what is considered a good fasting blood sugar zmn level | does botox affect 8xQ blood sugar | 3mx high sugar level in urine but not in blood | diabetes low Ot5 blood sugar detection | 7Qf diabetic retinopathy blood sugar levels | blood sugar after high protein meal BJc | 343 online sale blood sugar | fasting blood 62T sugar levels child | 0Ca does high blood sugar affect neuropathy pain | ezR libre blood sugar monitor cost | r1g black coffee and fasting blood sugar | can low blood DH9 sugar cause brain fog dizziness | blood sugar of 95 puS means what | does blood sugar luO affect thyroid | what Fpv to eat when blood sugar level drops | BOx strictiond blood sugar reviews | blood zjL sugar of 321 mg dl | what the mxd highest blood sugar level ever recorded | is 190 too C9P high for blood sugar after eating | what kind of vinegar w7o helps lower blood sugar | will 52p protein lower blood sugar in emergency | reactive hypoglycemia a3i blood sugar spike | food to eat cnb to control blood sugar | tcK non fasting blood sugar 114 | how to take someone blood sugar 4j5 | does metformin help with p5O low blood sugar | xqr can cholestyramine cause low blood sugar | what is AkQ considered a high blood sugar number | low blood sugar symptoms 6yT early pregnancy | best breakfast c2O to keep blood sugar low