నవతెలంగాణ-హైదరాబాద్: మాదకద్రవ్యాల వ్యవహారంలో సినీనటుడు నవదీప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ను ప్రశ్నించనుంది. డ్రగ్స్ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది.