![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230909-WA0028-300x135.jpg)
– బతుకమ్మ పేర్చి ర్యాలీ ప్రదర్శన
నవతెవలంగాణ – కంటేశ్వర్
నవతెవలంగాణ – కంటేశ్వర్
నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారు. సమస్యలను వేడుకుంటున్నారు ఈ మేరకు శనివారం ఎన్హెచ్ఎం ఉద్యోగులు బతుకమ్మ ఆడి ఉయ్యాలో ఉయ్యాలో కెసిఆర్ ఉయ్యాలో మమ్ములను రెగ్యులర్ చెయ్యు ఉయ్యాలో కరోనా సందర్భంగా ఉయ్యాలో మా ప్రాణాలను పణంగా పెట్టిన ఉయ్యాలో మమ్ములను గుర్తించయ్య ఉయ్యాలో పాటలు పాడుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ 2023 సెప్టెంబర్ 1 నుండి సమ్మె చేయుట గురించి.. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని యుపిహెచ్సి మరియు యుసి హెచలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. ఎన్హెచ్ఎంలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులకు రాష్ట్ర ప్రభుత్వం కిఆర్సి ప్రకారం జీతభత్యాలు చెల్లించడం లేదు. గతంలో జీఓ నెం.510 ద్వారా సుమారు 10 వేల మంది వరకు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఎఎన్ఎం తదితరులకు బేసిక్ ప్రకారం వేతనాలు నిర్ణయించి చెల్లిస్తున్నారు. ఇందులో కొన్ని కేటగిరీలకు పర్మినెంట్ ఎంప్లాయీ బేసిక్ కన్నా తక్కువ చెల్లిస్తున్నారు. మిగిలిన సుమారు 7 వేల మందికి కనీస బేసిక్ కాకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వీరందరికీ కనీస వేతనం, డీఎ, హెచ్ఎ తదితర అలవెన్సులు నిర్ణయించి అమలు చేయాలి. ప్రభుత్వ పిఆర్సి ప్రకారం కనీస వేతనాలు అమలు కాకుండా తక్కువ వేతనాలు పొందుతున్న కేడర్లలో అర్బన్ హెల్త్ సెంటర్స్‌లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, అకౌంటెంట్స్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ (కమ్యూనిటీ ఆర్గనైజర్స్), సపోర్టింగ్ స్టాఫ్‌లోని మెడికల్ అసిస్టెంట్స్, వాచ్మెన్, స్వీపర్స్ మరియు బస్తీ దవఖానాలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్ అలాగే బ్లడ్ బ్యాంక్ డిఇఓ, ల్యాబ్ అటెండర్, ఎస్ఎస్సీయు సిబ్బంది, ఎంసిహెచ్ హాస్పిటల్స్ లోని ఓటి అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఆర్ఎఎస్కి మెడికల్ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్ఎంలు, డ్రైవర్లు, ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఎస్ఓ, ఎఫ్ఎస్ మరియు డిఎసిస్, ఎన్ సిడీ, టిబి లెప్రసీ, ఎస్ఆరెస్, టిడి హబ్, సిహెచ్ కంటింజెంట్ తదితర విభాగాలలో పని చేస్తున్న వారందరూ తక్కువ వేతనాలు పొందుతున్నారు. వీరందరికీ వారి కేడర్ ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలోని పర్మినెంట్ ఉద్యోగుల యొక్క బేసిక్, అలవెన్సులు నిర్ణయించాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. Kగత అనేక సం॥లుగా పనిచేస్తున్న ఎన్ హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది. కావున 2023 సెప్టెంబర్వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హె హెచ్ఎం పారామెడికల్ ఉద్యోగులంతా సమ్మె చేయాలని నిర్ణయించాము. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాము. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. 510 జీఓ అమలు కాని కేడర్లకు కూడా బేసిక్, డిఎ, హెచ్ఐ తదితరములు కలిపి గ్రాన్ శాలరీ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీనిb రూపొందించాలి. మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. సమస్యలను పరిష్కారం చేయకుంటే సమ్మె ద్వారా పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షాదుల్లా సెక్రెటరీ వెంకటేష్ పటేల్ మరియు రమేష్ ఎర్ర మురళి మహమ్మద్ హుస్సేన్ గంగారాం వందన సంధ్యారాణి మొదలగు వారు పాల్గొన్నారు.