మళ్ళీ పెళ్లి రిలీజ్‌కి రెడీ

నరేష్‌ వి.కె, పవిత్ర లోకేష్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’.యూనిక్‌ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఎంఎస్‌ రాజు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నరేష్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌, టీజర్‌, పాటలు ఇలా ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి కావేరి గాలిలా పాటని విడుదల చేశారు. సురేష్‌ బొబ్బిలి ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడియస్‌ ట్యూన్‌గా కంపోజ్‌ చేశారు. నరేష్‌ అయ్యర్‌ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్‌ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో నరేష్‌, పవిత్ర లోకేష్‌ల కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్‌, అనన్య నాగళ్ల, రోషన్‌, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్‌ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎంఎస్‌ రాజు, డీవోపీ: ఏంఎన్‌ బాల్‌ రెడ్డి, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిక్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: భాస్కర్‌ ముదావత్‌.

Spread the love