ఢిల్లీలో ‘వెరీ పూర్‌’ కేటగిరీలో గాలి నాణ్యతలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి నాణ్యతలు మరోసారి క్షీణించాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఎక్యూఐ (గాలి నాణ్యతలు) 349 స్థాయిల్లో నమోదైందని, ఎక్యూఐని వెరీ పూర్‌ కేటగిరీలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఈరోజు ఢిల్లీలో గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
కాగా, ఎక్యూఐ 50గా నమోదైఐతే గుడ్‌, 101 నుంచి 200 మధ్య నమోదైతే మధ్యస్థమని, 201 నుంచి 300 మధ్య నమోదైతే పూర్‌, 301 నుంచి 400 మధ్య నమోదైతే వెరీ పూర్‌, 401- 500 మధ్య నమోదైతే తీవ్రస్థాయిలో గాలి నాణ్యతలు వర్గీకరించనున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.