పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుసచంద్రయ్య
నవతెలంగాణ-కొడంగల్‌
ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇం టి స్థలాలు కేటాయించి ఇండ్లు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య అన్నారు. దుద్యా ల మండల తహసీల్దార్‌ భీమయ్య గౌడ్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో మెమోరండం అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలం దరికీ కేంద్ర ప్రభుత్వం రూ.10 పది లక్షలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వమిచ్చిన హామీని అమలు చేయాలని సీఐటీ యూగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తా మని గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. ఇంటి నిర్మా ణం కోసం రూ.3 లక్షలు సరిపోవని 3లక్షల నుంచి 5 లక్షలకు పెంచి అర్హులైన పేదలందరికీ వర్తింప చే యాలన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 61 కేంద్రాల్లో 48 వేల మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని జీవో నెంబర్‌ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలందరికీ క్రమబ ద్ధీకరణ చేసి వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నమన్నారు. ఇండ్లు నిర్మించుకునే పేదలపై ప్రభుత్వ నిర్బంధం వెంటనే ఆపాలని పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. గతంలో పట్టా పొందిన పేదవాళ్లకు ఇళ్ల జాగా సరిహద్దులను నిర్ణయించి భూమిని అప్పగించాలన్నారు. కార్యక్రమంలో వెంక టయ్య, రమేష్‌, రాములు, వ్యవసాయ కార్మిక సం ఘం నాయకులు అనంతయ్య, కేశవులు, రాజు నాయ క్‌, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.