ఎటు చూసినా విజ్ఞానమే
ఎటు చూసినా అందమే
ఎటు చూసినా అమితానందమే
పరమానందమే
ఈ అక్షయ సుందర
విజ్ఞానం చంద్రబింబం
ఎటు చూసిన సత్యమే
ఎటు చూసిన నిత్యమే
మేధకు హద్దేలేదు
అంచెలంచెలు విజ్ఞానం
నిరంతరము విజ్ఞానం
భౌతిక శాస్త్రం సహజ శాస్త్రం
అధ్యయనం నైపుణ్యం
ప్రాథమికం సహజ తత్వం
విద్యుదయస్కాంతత్వం
పరిమాణాత్మకం, గుణాత్మకం
కమ్మదనం గణనీయం
దక్పథం స్వభావం
భూకేంద్రం సూర్యకేంద్రం
సిద్ధాంతం ప్రభావితం
చలనం నియమం
సార్వత్రిక గురుత్వాకర్షణ
ఆవిష్కరణం ఏకీకరణం
పారిశ్రామిక విప్లవం
సాపేక్ష సిద్ధాంతం
అణువు పరమాణువు
ఉప పరమాణువులు
సూక్షాతి సూక్ష్మం
మనోఫలకం కరతలామలకం
బ్రహ్మాండం ఖగోళం
విజ్ఞానవీక్షణం సమస్తం
అద్భుతం అనంతం
మేధోమథనం సమగ్రం
సర్వము శ్రేష్టము
కరచాలనం అభినందనం అభివందనం
– ప్రొ|| సీతారామ రాజు సనపల,
7259520872