శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం

నవతెలంగాణ – హైదరాబాద్: శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ తో ప్పిపంపారు. గవర్నర్ తిప్పిపంపి‌న బిల్లులను మరోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.
1.మున్సిపాలిటీలలో కోఆప్షన్‌ సభ్యుల సంఖ్య 5 నుంచి 15కు పెంపు బిల్లు.
2. వైద్య ప్రొఫెసర్ల పదవీకాలం పొడగింపు బిల్లు.
3. ప్రైవేటు వర్సిటీల బిల్లు.
4. భద్రాచలం జీపీని కొత్తగా మరో రెండు జీపీలుగా ఏర్పాటు చేయడం.
సహా నాలుగు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. కాగా శాసనమండలి రేపటకి వాయిదా పడింది. రేపు ఉదయం 10గంలకు శాసనమండలి తిరిగి సమావేశంకానున్నది.

Spread the love