ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనెలకు ఏ కాలంలోనైనా చర్మాన్ని రక్షించగలిగే శక్తి వుంది. ఈ నూనెలు అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం…
కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనె శరీరానికి రాసుకుంటే ముడతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఎలాంటిదైనా కొబ్బరినూనె వాడొచ్చు.
ఆలివ్ ఆయిల్ : చర్మ సౌందర్యానికి చక్కని సాధనం. దీనిలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనె మర్దనతో చర్మం ఎంతో సౌందర్యంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.
ఆల్మండ్ ఆయిల్ : చర్మాన్ని ఎండిపోనివ్వదు. ఈ నూనె రాసుకుంటే చర్మం తేమను గ్రహిస్తుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలకు ఆల్మండ్ నిరోధిస్తుంది.
నువ్వుల నూనె : నువ్వుల నూనెలోని విటమిన్ బి, ఇ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియం, మెగ్నీషియంల వల్ల చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది.