చర్మ నిగారింపుకు…


గంధపు చెక్కను రోజ్‌ వాటర్‌తో అరగదీసి.. దాన్ని ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి.
టమాటా గుజ్జు, పెరుగు చెంచా సుమారుగా తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.
రెండు చెంచాల ఓట్‌ మీల్‌లో చెంచా చందనం పొడి వేసి సరిపడినంత రోజ్‌ వాటర్‌ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత మసాజ్‌ చేసుకొంటున్నట్టుగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్నమతకణాలు తొలగిపోతాయి.
చిన్న సైజులో ఉన్న టమా టాను తీసుకొని దాన్ని చెంచా సాయంతో మెత్తగా చేయాలి. ఇందులో కొద్దిగా చక్కెర కలిపి మిశ్రమంగా తయారు చేసి, ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చేతి వేళ్లను తడి చేసుకొని మసాజ్‌ చేస్తున్నట్లు మొత్తం రుద్దుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Spread the love