
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గంలో మాజీ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్ ఆరోపించారు. మహాముత్తారం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల రాజిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, మాజీ నక్సలైట్ బక్కారావ్ కత్తితోదాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాజీ నక్సలైట్లను పార్టీలోచేర్పించుకుని వాళ్లకు మారణాయుధాలు ఇచ్చి నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నాయకులపై దాడులకు పాల్పడడం సరికాదన్నారు. మాజీ నక్సలైట్లు బక్కారావు, చంద్రన్నలాంటి వాళ్లను ఉపయోగించుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారన్నారు. ఓడేడ్ సర్పంచ్ బక్కారావ్‌కు ముహముత్తారం మండలం వెళ్లాల్సిన అవసరం ఏముందని, అక్కడ ఆయన సామాజికవర్గం ఏమీ లేకున్నా గతంలో నక్సలైట్‌గా ఆ ప్రాంతంలో తిరిగిన చరిత్ర ఉండటం మూలంగానే భయానక వాతావరణం సృష్టించాలని కాదా అని ఆయనప్రశ్నించారు.