నవతెలంగాణ- హైదరాబాద్: రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.2 లక్షల 40 వేలు అధికం కావడం విశేషం. 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 36 మంది వేలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు.