కొంతమందికి ఫ్యాషన్ అంటే విపరీతమైన ఇష్టం. తమకిష్టమైన చీరలు, అనార్కలి డ్రెస్సులు, చుడీదార్స్ పదే పదే కొంటుంటారు. పైగా వాటిని రెగ్యులర్‌గా వాడతారా అంటే.. అది కూడా డౌటే. రకరకాల వస్తువులు కూడా కొని బీరువాలో సర్దేస్తారు. అవి పాతబడకుండానే.. మళ్లీ కొత్తవి కొనేస్తారు. తర్వాత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టామని బాధపడుతుంటారు. అయితే పదే పదే కొత్త డ్రెస్సులు కొనే బదులు.. ఉన్నవాటితోనే అందమైన వార్డ్ రోబ్ తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే…
న ప్రతీ నెల వార్డ్ రోబ్ సర్దుకొనే విధానంలో మార్పులు చేస్తే చాలా ఫలితాలుంటాయి. ఎప్పుడూ పాత దుస్తులనే చూస్తున్నారనే భావన కలగదు. రీ ఎరేంజ్ చేసేటప్పుడు నచ్చినవాటిని తొలి వరుసలో పెట్టి.. పెద్దగా నచ్చని వాటిని వెనుక వరుసలో పెట్టండి. అలాగే కొని వాడని దుస్తులను మొదటి వరుసలో పెట్టి.. ఎక్కువగా వాడిన వాటిని వెనుక వరుసలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ ఒకే వార్డ్ రోబ్‌ని చూస్తున్న ఫీలింగ్ కలగదు.
న వార్డ్ రోబ్‌కు మంచి లుక్ రావాలంటే.. నెలకు ఒకసారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కొని వాడని మంచి దుస్తులు ఏవైనా ఉంటే వాటిని అడిగి తీసుకోండి. అలా అడిగి తీసుకున్న దుస్తులను మీరే మళ్లీ రీ డిజైన్ చేసి కొత్త ఫ్యాషన్ లుక్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఖర్చు కూడా కలిసొస్తుంది.
న వార్డ్ రోబ్ సర్దడం ఒక ఎత్తైతే.. కలర్ కాంబినేషన్ ఆధారంగా విభజించుకోవడం మరో ఎత్తు. అందుకే ఒకసారి మీ క్లోజెట్ మొత్తాన్ని తేరిపారా చూడండి. ఏ శారీకి ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుందో.. ఏ మిడ్డీకి ఏ రంగు స్కర్ట్ మ్యాచ్ అవుతుందో ఒకసారి పరిశీలించండి. వాటికనుగుణంగా క్లోజెట్‌లో మార్పులు చేస్తే లుక్ అదిరిపోతుంది.
న వార్డ్ రోబ్‌లో దుస్తులతో పాటు ఫ్యాషన్ ఐటమ్స్, నగలు, ఆభరణాలు, జుమ్కీలు మొదలైన వాటికి చోటు కల్పించండి. మీరు దుస్తులను సెలెక్ట్ చేసుకొనేటప్పుడు అందుకు మ్యాచ్ అయ్యే వస్తువులను కూడా కచ్చితంగా ఎంపిక చేసుకోండి. ఇలా చేయడం వల్ల పదే పదే పాత దుస్తులనే ధరిస్తున్నారనే ఫీలింగ్ రాదు. వార్డ్ రోబ్‌కు కూడా కొత్త లుక్ వస్తుంది.
న పాత బట్టలను మళ్లీ కొత్తగా నచ్చినట్లు ఆల్ట్రేరేషన్ చేసి మీరే కొత్త డిజైన్స్ తయారు చేయండి. ఇలా చేయడం వల్ల ఖర్చు కూడా కలిసొస్తుంది. అదేవిధంగా మీలో క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది.