హైదరాబాద్: ప్రముఖ రిటైల్ మొబైల్ చైన్ బిగ్ సీ తన 21 వార్షికోత్సవం సందర్బంగా వినియోగదారులకు వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇది వరకు ఎప్పుడూ కనీవినీ ఎరుగని సంచలన ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సి ఫౌండర్, సీఎండీ ఎం బాలు చౌదరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ పండుగను ప్రత్యేక సందర్బాన్ని పురస్కరించుకుని ఆకర్షణీయ డిస్కౌంట్లను అందించడం తమ సంస్థ అనవాయితీ అని వెల్లడించారు. ఈ వార్షికోత్సవం సందర్బంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,10,000 విలువ గల హెల్త్‌కేర్ ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ ఆఫర్‌లో ఒక ఏడాది పాటు అపరిమిత టెలి ఫోనిక్ డాక్టర్ కన్సల్టేషన్, ప్రమాద బీమా, మందులపై 20 శాతం వరకు రాయితీ, రూ.5,000 వరకు అంబులెన్స్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా రూ.21కే రూ.4,999 విలువ గల ఫైర్‌బోల్ట్ స్మార్ట్‌వాచ్ లేదా రూ.2999 విలువగల రెడ్మీ బడ్స్ ఆఫర్‌ను అందిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఒక కచ్చితమైన బహుమతి అందిస్తున్నామన్నారు. బ్రాండెడ్ పరికరాలపై 51 శాతం వరకు రాయితీ పొందవచ్చన్నారు.