ప్రతిపక్షాల గొంతు నొక్కి అడ్డదారుల్లో ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ ప్రయత్నం

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రతిపక్షాల గొంతును నొప్పి అడ్డదారుల్లో ఎన్నికలలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం వైఖరిటీ నిరసిస్తూ నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. బీజేపీ పట్ల వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చటానికి, ఎన్నికల్లో తిరిగి కారం పొందటానికి కేంద్ర ప్రభుత్వం తన లో ఉన్న సిబిఐ, ఈడి, ఇన్కమ్ టాక్స్ వంటి స్వతంత్ర సంస్థలను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా ప్రతిపక్షాల పైన అవినీతి ఆరోపణల పేరుతో దాడులు చేస్తూ  ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కటం కోసం  ఆ సంస్థలను అడ్డం పెట్టుకొని అరెస్టులు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల ముందర జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరేన్  అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను, మరియు బీఆర్ఎస్ నాయకురాలు కవితను అదేవిధంగా ఇతర ప్రతిపక్షాల కు చెందిన  డీఎంకే నాయకులను చేయటంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి బయటపడుతుందని ఏదో రకంగా ప్రతిపక్షాల నాయకులను కొని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి చేసే కుట్రలు తప్ప నిజాయితీ కనబడటం లేదని వారు ఆరోపించారు. అవినీతిపరులైన నాయకులు బీజేపీ పంచన చేరితే వారి పైన ఎటువంటి చర్యలు ఉండటం లేదని వారన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో పోరాడి విజయం సాధించాలి తప్ప ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం అవివేకం అవుతుందని వారన్నారు గతంలో హిట్లర్ తన ఏక చక్రాధిపత్యం ద్వారా గుత్తాధిపత్యాన్ని సాధించాలని ప్రయత్నించి ఏ విధంగా అయితే ప్రజా తిరస్కరణకు గురయ్యారు ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజల తిరస్కరణకు గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.  రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను పెట్టుబడిదారుల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా తగిన గుణపాఠం చెప్పాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వెంకటేష్, సూరి, సుజాత, అనిల్, విగ్నేష్, మహేష్ సీపీఐ నాయకులు నర్సింగరావు, రఘురాం,  సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు ప్రభాకర్ ,దేవరం, సుధాకర్, సురేష్, సాయ గౌడ్ ,న్యూ డెమోక్రసీ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.