11న ”శ్యామ” ఆవిష్కరణ

రవీంద్రనాథ్‌ టాగోర్‌ కవిత్వ తెలుగు అనువాదం ”శ్యామ” పుస్తకాన్ని మార్చి 11 శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా||పాపినేని శివశంకర్‌ గుంటూరు  గార్డన్స్‌లోని అన్నమయ్య గ్రంధాలయ ప్రాంగణంలో ఆవిష్కరిస్తారు. కాట్రగడ్డ దయానంద్‌ అధ్యక్షత వహించే ఈ సభలో కవిత్వ అనువాదకులు కందిమళ్ళ శివప్రసాద్‌, డా||భూసురపల్లి వెంకటేశ్వర్లు, శ్రీరామకవచం సాగర్‌, డా|| ఆరేటి కష్ణ కుమారి, డా||రావి రంగారావు వక్తలుగా పాల్గొననున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.