1వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు..

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రం లోని ఒకటవ వార్డులో  బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ప్రజా ప్రతినిధులు శుక్రవారం నాడు ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సిసిరోడు పనులను ప్రారంబింంచారని వార్డు మెంబర్ అంజవ్వ తెలిపారు. ఈ సంధర్భంగా నాయకులు సీనీయర్ నాయకుడు నీలుపటేల్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో దాదాపుగా అన్ని వార్డులలోని కాలనీలలో సీసీ రోడ్డు, మురికి కాలువలు నిర్మించామని, పెండింగ్ పనులను పూర్తీ చేసి ప్రజా సమస్యలను ఎమ్మెలే హన్మంత్ షిండే  సహకారంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఉమాకాంత్, వార్డుసబ్యులు, బీఆర్ఎస్ నాయకుడు నీలుపటేల్  మరియు యువకులు సంతోష్, ప్రవీణ్, రషీద్, జావిద్, మెాషిన్, సాజీద్ తదితరులు పాల్గోన్నారు.