ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలో మంగళవారం పలుచోట్ల సీఐటీయూ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.స్థానిక కార్యాలయంలో జెండాను మున్సిపల్‌ కార్మికురాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాంబాబు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటివరకు కార్మికుల పోరాడు సాధించుకున్న చట్టాలను కుదించి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన నాలుగు లేబర్‌ కోడులను తెచ్చిందని విమర్శించారు. దీని ద్వారా కార్మికులు సాధించుకున్న చట్టాలను కోల్పోయి హక్కులకు బంగం ఏర్పడిందన్నారు.సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ కోట్లాది మంది కార్మికుల, ఉద్యోగుల ఉద్యోగాలను తొలగించి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆదానీ ,అంబానీ ఆస్తులను వందల రెట్లు పెంచి శతకోటేశ్వర స్థానంలో మోడీ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు. మోడీ దేశాన్ని కులమతాల పేరు మీద చీల్చి మను వాద సిద్ధాంతం తీసుకొచ్చి దేశాన్ని హిందూ దేశంగా మార్చి భారత రాజ్యాంగానికి తూట్లుపరిచే విధంగా చేస్తున్నారని ఆరోపించారు.రానున్న కాలంలో బీజేపీ అనుసరిస్తున్న మనవాద కార్పొరేట్‌ అనుకూల విధానం వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు..రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వం 73 షెడ్యూల్‌ పరిశ్రమల వేతన సవరణ జీవోను అమలు చేయకుండా జాప్యం చేస్తుందన్నారు.గ్రామ పంచాయతీ మున్సిపల్‌ ఐకెపి ఉద్యోగుల వేతనాలు పెంచాలన్నారు.ఐకేపీ, వీవోఏల సమ్మెను విరమింపజేసి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో వైద్య కళాశాల సిబ్బంది, ఎల్‌ఐసీ సిబ్బంది, హమాలీలు వివిధ యూనియన్లు సీఐటీయూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేశారు.ఈ కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.శేఖర్‌, ఆర్టీసీ రీజినల్‌ సెక్రెటరీ బత్తుల సుధాకర్‌,సీఐటీయూపట్టణ కన్వీనర్‌ మామిడి సుందరయ్య, వల్లపుదాసు సాయికుమార్‌, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ యూనియన్‌ నాయకులు శ్రీను, ఎల్‌ఐసీ యునియన్‌ అధ్యక్షులు రామన్న, సంజీవ, నరేష్‌, పాషా, హమాలీ కార్మికులు బద్రు, చంద్రయ్య, సత్తనాయక్‌, లింగా, శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుజూర్‌నగర్‌టౌన్‌:మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను డిమాండ్‌ చేశారు.మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మికులు, కర్షకులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.అనేక లేబర్‌కోడ్‌లను కుదింపు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తెరమీదకు తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు.కరోనాకాలంలో డాక్టర్స్‌ తర్వాత మున్సిపల్‌ గ్రామపంచాయతీ కార్మికులను దేవుళ్ళుగా కొనియాడిన ప్రభుత్వం ప్రస్తుతం మున్సిపల్‌ కార్మికులపై పనిభారం పెంచుతూ కనీసవేతనం అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను తగ్గించి అధిక పనిభారం మోపుతున్నారన్నారు.పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల్ని నియమించాలని కోరారు.పెండింగ్‌ బిల్లులకు వెంటనే నిధులు కేటాయించి ప్రతినెలా వేతనాలు, అలవెన్సులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికుల అధ్యక్షురాలు కస్తాల ముత్తమ్మ, కుమారి, దేవకరణ,సైదులు, కాశయ్య,వీరబాబు, నగేశ్‌, చంద్రమ్మ, పార్వతి, సైదమ్మ, గోవిందమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మఠంపల్లి: మండలకేంద్రంలో సీఐటీయూ జెండాను ఆ సంఘం కన్వీనర్‌ ఎస్‌డీ.రన్‌మియా జెండాను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో మంగళపల్లి మైసయ్య,కోలా గుర్వారెడ్డి, నర్సింహారెడ్డి, మంగళపల్లి ముత్యం,కందుకూరి సైదులు, తుపాకులగురవయ్య, భూక్యా సైదా, సత్తారాపు జయరాజ్‌, కందుకూరు వెంకటేశ్వర్లు, మంగళపల్లి సైదులు, పూలనాగరాజు, వీరజానకి, లింగమ్మ,గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్‌: కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ విమర్శించారు.మండలకేంద్రంలో సీఐటీయూ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హామాలీ సంఘం అధ్యక్షులు కోట సైదులు, ఒగ్గు నాగయ్య, జానయ్య, శంకర్‌,కత్తిఉపేందర్‌, బక్కయ్య, షేక్‌ సైదులు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్‌: దేశంలో రాష్ట్రంలో సంఘటిత అసంఘటితరంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ జెండా అండగా ఉంటుందని సీఐటీయూ జిల్లా కోశాధికారి కోటగిరి వెంకట్‌నారాయణ కోరారు.పట్టణంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూరగాయల మార్కెట్‌లో జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎం.ముత్యాలు, దాసరి శ్రీనివాస్‌, కార్మికులు సత్తిరెడ్డి, శరబందర్‌రెడ్డి, శ్రీను, రాంబాబు, వెంకన్న, ఉపేందర్‌,సైదులు,వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.
మోతె: మండలకేంద్రంలో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘంమండలఅధ్యక్షులు సైదులు,ఎన్‌.రంగయ్య, ఎస్‌.సైదులు, లింగయ్య, వెంకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తుంగతుర్తి: కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసేది సీఐటీయూ మాత్రమేని బిల్డింగ్‌ వర్కర్స్‌ రాష్ట్ర కార్యదర్శి కోటంరాజు అన్నారు.తుంగతుర్తి డివిజన్‌ కేంద్రంలోని బిల్డింగ్‌ వర్కర్స్‌ అండ్‌ కన్స్ట్రక్షన్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి ఎలుక సోమయ్య, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మల్లెపాక నగేష్‌, కార్యదర్శి మన్సూర్‌ అలీ, రమేష్‌, ప్రభాకర్‌, అబ్బాస్‌ కొమురయ్య, శేఖర్‌ , శివ, గడ్డంఎల్లయ్య, ఫకీర్‌,ఖాశీం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love