రాకేశ్‌ మాస్టర్‌ మృతికి సీఐటీయూ సంతాపం

–  అంత్యక్రియల్లో పాల్గొన్న చుక్కరాములు, పాలడుగు, కె.ఈశ్వర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాకేశ్‌ మాస్టర్‌ అంత్యక్రియల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు పాల్గొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాకేశ్‌ మాస్టర్‌ ఇంటి వద్ద నుంచి బోరబండ సైడ్‌ త్రీ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..’ఆయన కేవలం నృత్య కళాకారుడే కాదు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. రాకేశ్‌ మాస్టర్‌ అకాల మరణం సినీ పరిశ్రమకు, ప్రజానీకానికి తీరని నష్టం. సినీ రంగంలో అనేక సినిమాలకు కొరియోగ్రాఫర్‌ చేసి అనేకమంది డ్యాన్స్‌ మాస్టర్లను తయారు చేశారు. వినూత్న రీతిలో డ్యాన్స్‌ చేయడంలో ఆయన దిట్ట. అలాంటి వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన మృతి సామాజిక ఉద్యమాలకు తీరని లోటు’ అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జూబ్లీహిల్స్‌ నాయకులు రాపర్తి అశోక్‌, ఐద్వా నాయకురాలు శశికళ కూడా పాల్గొన్నారు.

Spread the love