కాంపౌండ్‌ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌

అదితి స్వామి… అండర్‌-18 కాంపౌండ్‌ మహిళల కప్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరించింది. రికార్డు సృష్టించింది. తన అసాధారణమైన ప్రతిభను యూత్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లలో కొనసాగించింది. ఫైనల్‌లో యుఎస్‌కి చెందిన లీన్‌ డ్రేక్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 142-136 స్కోరుతో ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
జూనియర్‌ విభాగంలో తాను సాధించిన విజయాలతో పాటు కొలంబియాలో గత నెలలో సీనియర్‌ విభాగంలో కూడా అరంగేట్రం చేసింది. అక్కడ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం అదితి ఎదుగుదలకు మరింత బలాన్ని ఇచ్చింది. అలాగే సీనియర్‌ స్థాయిలో పోటీపడేందుకు అవసరమైన సామర్థ్యాన్ని ఇచ్చింది. విలువిద్య ప్రపంచంలో ఆమె స్థిరమైన ప్రదర్శనలు, ఆటలో ఒత్తిడిని నిర్వహించడం మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
”ఇది నా మొదటి యూత్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌. నాకు చాలా ప్రత్యేకమై నది. ఇప్పుడు నేను క్యాడెట్‌ ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాను. ఐర్లాండ్‌లోని యూత్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మా జట్టు స్వర్ణం గెలుచుకుంది. అయితే వాతావరణ పరంగా ఈ వారం సవాలుగా ఉంది. చల్లటి గాలులతో కొన్ని సార్లు దృష్టిని కేంద్రీకరిం చడం కష్టమయింది. అయితే నా బృందం వీటన్నింటినీ సవాలుగా తీసుకుంది. కాబట్టే విజయం సాధించ గలిగాం. నా తల్లిదండ్రులు, నా కోచ్‌, నన్ను నమ్మిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపు తున్నాను” అంటూ అదితి సోషల్‌ మీడియా ద్వారా తన కోచ్‌, మేనేజ్‌మెంట్‌, తల్లిదండ్రులకు కృతజ్ఞత లు తెలిపింది. భారతీయ ఆర్చరీకి చెందిన అనేకమంది యువత ప్రపంచ స్థాయిలో తమ సత్తాను చాటుకోవడంతో క్రీడకు మంచి భవిష్యత్‌ ఉందని ఆమె నమ్ముతుంది.