– సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ- మధిర
ప్రజల పక్షాన పోరాడే పార్టీ, ప్రశ్నించే గొంతు సిపిఐ(ఎం)నేనని, మధిర నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమని మధిర అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్ ప్రజలను కోరారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణింద్ర కుమారి అధ్యక్షతన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి స్టేషన్ రోడ్, హరిజనవాడ, విజయవాడ రోడ్డు, ముస్లిం బజార్, యాదవ బజార్, మెయిన్ రోడ్, లడక బజార్‌లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం డబ్బు సంచులతో వచ్చే వారిని ఓడించి ప్రజలకోసం పోరాడే తనను గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తనను మన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుకన వుతానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం నరసింహారావు, ఒంగురి రాములు, పడకండి మురళి, తేలబ్రోలు రాధాకృష్ణ, మద్దాల ప్రభాకర్, మందా సైదులు, మధు, విజరు, వెల్సన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేగా గెలిపించండి
మధిరను అభివృద్ధి చేసి చూపిస్తా
ఆత్కూరు, కృష్ణాపురం, సిరిపురం, రొంపిమల్ల, మల్లారం, రామచంద్రపురం, గ్రామాలలో బుధవారం సీపీఐ(ఎం) మధిర అభ్యర్థి పాలడుగు భాస్కర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఎన్నికల పోటీ జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉండడం వల్ల మధిరకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజల తరఫున పోరాడే పార్టీ సిపిఐ(యం) అని, నిత్యం సమస్యలపై అంగన్వాడీలు, ఆశాలు, హమాలీలు, ప్రతి కార్మిక సంఘాల హక్కులను పోరాడి సాధించామని, ప్రభుత్వంపై ఎన్నో ఉద్యమాలు చేశామని, అందువల్ల ప్రజల యొక్క బాధలు తెలుసు అని, ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి నన్ను మధిర ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కోశాధికారి అధికారి మందడపు సాయిబాబు, మధిర మండల కార్యదర్శి మంద సైదులు, శీలం నరసింహారావు, మద్దాల ప్రభాకర్, మధు, విజరు, సుధాకర్ నాయకులు పాల్గొన్నారు.