నిరుపేద ఇంటి నిర్మాణానికి ఉప్పల చేయూత

నవతెలంగాణ-ఆమనగల్‌
ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో ముకురాల గ్రామంలో నిర్వ హించిన వైద్య శిబిరం సందర్భంగా ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొం డపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్‌ గ్రామంలో పర్యటిం చారు. గూడు లేక ఇబ్బందులు పడు తున్న నారమళ్ళ చెన్నయ్య పద్మమ్మ దంపతులకు తన ట్రస్ట్‌ ద్వారా ఇల్లు నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం పద్మమ్మ ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చారు. చెన్నయ్య పద్మమ్మ దంపతులు ఉప్పలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నరేందర్‌ రెడ్డి, భారత జాగృతి నాయకులు గణేష్‌, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.