ఘనంగా గురుకుల కళాశాలలో దశాబ్ది వేడుకలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ది రామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ గురుకుల కళాశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కళాశాల ఆవరణలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మానవహారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగం వల్ల రాష్ట్రం సిద్ధించి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.