– డివైయఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్
నవతెలంగాణ-వైరాటౌన్
దేశంలో మోడీ, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల రూపకల్పనకు మే 27, 28 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న డివైయఫ్‌ఐ ఆలిండియా కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని డివైయఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం వైరా పట్టణంలోని బోడేపుడి వెంకటేశ్వరరావు భవనంలో డివైయఫ్‌ఐ వైరా నియోజకవర్గ సమావేశం వైరా పట్టణ కార్యదర్శి షేక్.నాగుల్ పాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతల రమేష్ మాట్లాడుతూ బీజేపీ, మోడీ అవలం బిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనకు మే 27, 28 తేదీలలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డివైయఫ్‌ఐ ఆలిండియా కమిటీ సమావేశాల సందర్భంగా మే 26న రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశాలకు డివైయఫ్‌ఐ ఆలిండియా నాయకత్వం హాజరవుతున్నారని, యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైయఫ్‌ఐ యంగ్ ఉమెన్ జిల్లా కో కన్వీనర్ మరపాటి సుజాత, వైరా నియోజకవర్గం నాయకులు చిత్తరు మురళి, షేక్.యాకూబ్, మురళి, సురేష్, సాగర్, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.