తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో అపశృతి

నవతెలంగాణ నిజామాబాద్: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఊరూర చెరువుల పండుగ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిజామాబాద్ భీంగల్ మండలం పురనిపెట్ గ్రామంలో ఊరుర చెరువుల పండగ సందర్భంగా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు బాణసంచా పేల్చగా అక్కడే ఉన్న టెంట్ పై పడడంతో ఒక్కసారి మంటలు చెలరేగాయి.  వెంటనే స్థానికులు మంటలు అర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఊరూర చెరువుల పండుగ కార్యక్రమం జరుపుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రతి ఊరిలో చెరువు కట్టల వద్దకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో వెళ్తారు.  చెరువు కట్టలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.  ఆటలు, పాటలతో కట్ట మైసమ్మ పూజలు నిర్వహించి హాజరైన వారందరికీ భోజన వసతి కల్పించాలని అధికారులు ఆదేశించారు.

Spread the love