సొసైటీ ఆధ్వర్యంలో జిలుగు విత్తనాల పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు జిలుగు విత్తనాలను సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో 30 కేజీల బ్యాగు 842.70 రూపాయలకు విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకువచ్చి జిలుగు విత్తనాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, వైస్ చైర్మన్ రత్నం, ఎండోమెంట్ చైర్మన్ సిద్ధ రాములు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ దుర్గారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు, సీఈవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.