డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ..

నవతెలంగాణ – కర్ణాటక: ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకేకు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు. అయితే, ఈ భేటీ తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love