ఫ్యాన్స్‌కి డబుల్‌ ధమాకా

‘ఓజి’ 50శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందనే అప్‌డేట్‌తో ఇప్పటికే ఖుషీలో ఉన్న పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి మరో అప్‌డేట్‌ మరింత కిక్‌ ఇచ్చింది. పవన్‌కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ తొలిసారి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో మామాఅల్లుళ్ళు పక్కా మాస్‌ గెటప్‌లతో అందర్నీ అలరిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.వెంకటేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్‌ చేస్తున్నారు. అలాగే పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజి’ చిత్రాని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య డి.వి.వి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Spread the love