– జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ జ్యోతి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్ లో మంగళవారం నాడు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ వై గోవింద్, ఆ గ్రామ సర్పంచ్ విట్టల్, గురూజీ, ఎంపీటీసీ, సభ్యులు మందాకిని శ్రీనివాస్ గౌడ్, మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ నెంబర్ నిజాముద్దీన్, మాజీ సర్పంచ్ రామ, మేనూర్ గ్రామ యువకులు , పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.