ఈగ గంగారెడ్డి, సుధం రవిచందర్ పరామర్శించిన టీఎస్ చైర్పర్సన్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ లోని బోర్గం లో టిఆర్ఎస్ మాజి జిల్లా అధ్యక్షులు ఈగ గంగా రెడ్డి అమ్మ ఈగ గంగవ్వ 8 రోజులక్రితం మరణించారు .వారి కుటుంబ సభ్యులను టీఎస్ డబ్ల్యూ సిడిసి చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలిత రాఘవేందర్, వారి తో పాటు మాజి మేయర్ ఆకుల సుజాత, బంటు నిర్మల, ఆకుల కవిత పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వినాయక్ నగర్ లో సుదం రవి చందర్ అమ్మ సుదం మల్లమ్మ 5 రోజుల క్రితం మరణించారు .వారి కుటుంబ సభ్యులు సుదం లక్ష్మి రవి చందర్ ని టీఎస్ డబ్ల్యూ సిడిసి చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ రవిచందర్ కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. టీఎస్ డబ్ల్యూ సిడిసి చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ తో పాటు మాజి మేయర్ ఆకుల సుజాత, బంటు నిర్మల, ఆకుల కవిత తదితరులు పాల్గొన్నారు.