హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ టెక్నలాజీ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : అమెరికాకు చెందిన మైక్రోచిప్‌ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్‌లో డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కోకపేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దీనిని సోమవారం మంత్రి కెటిఆర్‌ లాంచనంగా ప్రారంభించారు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో చాండ్లర్‌లో మైక్రోచిప్‌ టెక్నాలజీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉందని ఆ కంపెనీ ప్రెసిడెంట్‌, సిఇఒ గణేష్‌ మూర్తి అన్నారు. గణేష్‌ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ”భారతదేశంలో దాదాపు 25 సంవత్సరాలు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించిన అనుభవంతో ఈ కొత్త సదుపాయం రాబోయే సంవత్సరాల్లో మైక్రోచిప్‌ వద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి మాకు తోడ్పడుతుంది. ఈ సెంటర్‌ భారతదేశంలోని కీలక వ్యాపార కారిడార్‌లలో ఉండటంతో, గ్లోబల్‌ మైక్రోచిప్‌ వ్యాపార అవసరాలకు ఈ ప్రాంతంలో పెరుగుతున్న మా కస్టమర్‌ బేస్‌కు మద్దతుగా హెడ్‌కౌంట్‌ను గణనీయంగా విస్తరించడానికి మాకు దోహద పడుతుంది.” అని అన్నారు.