న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. సరారు భూపత్‌ స్టేషన్‌ నుంచి దాటిపోతున్న క్రమంలో స్లీపర్‌ కోచ్‌ నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్‌ మాస్టర్‌.. ట్రైన్‌ డ్రైవర్‌, గార్డ్‌కు విషయాన్ని చేరవేశాడు. దీంతో రైలును అక్కడే నిలిపివేయగా ప్రయాణికు లందరూ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు.
రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్నాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love