బహుజన రాజ్యాధికార సాధన కోసం

– ఉద్యమించడమే కామ్రేడ్ మారోజు వీరన్నకు నివాళి
– బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ 
నవతెలంగాణ కంఠేశ్వర్
       బహుజన రాజ్యాధికార సాధన కోసం ఉద్యమించడమే కామ్రేడ్ మారోజు వీరన్నకు నివాళి అని బహుజన లెఫ్ట్ పార్టీ-బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ కులవర్గ సైద్ధాంతిక యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ఉద్యమించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో  బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి బహుజన కమ్యూనిస్టు పార్టీ బిసిపి పార్టీల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన కామ్రేడ్ మారోజు వీరన్న 24వ వర్ధంతి సభలో దండి వెంకట్ మాట్లాడుతూ.. ఫూలే అంబేద్కర్ పెరియార్ మార్క్స్ ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్న క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో నరహంత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేసిన రాజకీయ హత్యలో కుల వర్గ సైద్ధాంతిక యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న మృతి చెందారని తెలిపారు.
తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి చెందుతుందని మారోజు వీరన్న చెప్పినప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ అభివృద్ధి ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీ సరిపోతుందని చెప్పారని తెలిపారు.
       సామాజిక న్యాయం విషయం సైతం 30 సంవత్సరాల క్రితం కామ్రేడ్ మారోజు వీరన్న చెప్పినప్పుడు వ్యతిరేకించిన వారంతా ఈరోజు సామాజిక న్యాయం అంటూ నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పసుల వెంకన్న మాట్లాడుతూ అన్ని సమస్యలకు పరిష్కారం బహుజన శ్రామిక వర్గ ప్రజలకు రాజ్యాధికారం తప్ప మరో మార్గం లేదన్నారు. ఈ కార్యక్రమానికి బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు న్యాయవాది జి.రమేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బహుళజన లెఫ్ట్ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వడ్ల సాయి కృష్ణ, బహుజన మహిళా సంఘం కామారెడ్డి జిల్లా అద్యక్ష , కార్యదర్శులు గంగా మణి, స్వప్న, సమ్రన్ , బిఎల్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ నగర కార్యదర్శి గంగా శంకర్, నాయకులు గోపి నాధథ్, విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ శ్రీమాన్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి, బహుజన కమ్యూనిస్టు పార్టీ బిసిపి పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.