– ఆటోక్రాస్ ఛాంపియన్ షిప్ నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు కోసం నిధులను సేకరించ డానికి, నగరంలో ఆటోక్రాస్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్‌షిప్‌ను తలపెట్టింది. ఆటోక్రాస్ అనేది ముందుగా నిర్ణయించిన ఒక గమ్యస్థానానికి చేరుకోవడానికి ఒక రకమైన రేసు. పాల్గొ నేవారు ముందుగా నిర్ణయించిన అడ్డంకులను దాటి వీలైనంత వేగంగా దాన్ని పూర్తి చేయాలి. ఇది సమయానికి ఎదురొడ్డి పోటీపడే పోటీ, ఈ ఫార్మాట్‌తో డ్రైవర్ నైపుణ్యం, కారు నియంత్రణకు నిజమైన పరీక్ష ఉంటు ంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లోని కస్టమ్ -బిల్ట్ రేస్ ట్రాక్‌లో ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సిద్దిపేట పట్టణంలోని సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ సదుపాయం ఏర్పాటుకు నిధులు సేకరించనున్నారు. జూన్ 2 నుంచి నాలుగు వరకు జరిగే ఈవెంట్ వివరాలను మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అనుపమ్ రాజ్, విష్ణు వివరించారు. మరిన్ని వివరాల కోసం 91 70931 92469 నెంబర్లో సంప్రదించవచ్చు.