
మిత్ర అదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ కంపెనీ మండలంలోని మద్దికుంటలో నిర్మించగా, నిర్మాణ సమయంలో గ్రామ అభివృద్ధికి, ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి, గత 4 సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేయగా, గ్రామ పాలకవర్గం, వీడీసీ, గ్రామస్తులు ప్రభుత్వ విప్పు, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ,ఎంపీపీ దశరథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి మిత్ర ఆదర్శ్ కంపెనీ తో మాట్లాడి, రూ 26 లక్షల చెక్కును గ్రామాభివృద్ధికి ఇప్పించారని, ఇప్పించినందుకు గ్రామ సర్పంచ్ బొమ్మిడి రామ్ రెడ్డి, వీడీసీ పాలకవర్గ సభ్యులు గంప గోవర్ధన్ కు, ఎంపీపీ దశరథ్ రెడ్డికి,మిత్రాయజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బొమ్మిడి రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బి ఆర్ ఎస్ సలావత్ బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ నరేందర్, విడిసి చైర్మన్ గజ్జల శంకర్, గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.