పాట: ఇది పగిలిన గుండెల పాట
మనసు కన్నుల పొంగిన ఊట
దు:ఖము నిండిన బాధల గీతం
ఏ దుర్మార్గానిది ఈ శాపం!
గాజా నేలన చిందే నెత్తురు
మనిషిని దోషిగ నిలబెట్టెనురా!
తెల్లని పువ్వుల పిల్లల మోమున
రక్తపు ధారలు పారేనా…
ధ్వంసమయ్యేటి మానవతను
చూస్తూ లోకం మూగబోయెనా!
పాపం పిల్లలు పాఠం నేర్వగ
బాంబుల వర్షం కురిసిందా!
వందలాది పసి కందుల ప్రాణం
తీసిన దేశము ఉరివేయాలి!
అమెరికానో ఇజ్రాయెలో
ఆయుధాల బేహారులు వీళ్లు
ప్రపంచ దానవ జాతికి మారుగ
మారిన నేరము నిలదీయాలి!
పాలస్తీనా ప్రజాస్వామిక
హక్కుకు అండగ ఉండాలి
మనుషుల చంపే అధికారంపై
మంటల క్షిపణయి పేలాలి!
– కె.ఆనందాచారి,
99487 87660