కార్పొరేట్ కు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ విద్యను బ్రష్టుపట్టిస్తూ


– ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుల అగ్రహం
– వసతి గృహల్లోని విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్
– మండల కేంద్రంలోని డీగ్రీ కళాశాల ఏర్పాటు విజ్ఞప్తి
– కేజీవీబీల్లో ఇంటర్మీడీయట్ విద్యను అప్ గ్రెడ్ చేయాలని సూచన
నవతెలంగాణ- బెజ్జంకి
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన ద్యేయమని చెబుతూనే పరోక్షంగా కార్పొరేట్ విద్య సంస్థలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యను బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రష్టుపట్టిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ అగ్రహం వ్యక్తం చేశారు.విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అద్వర్యంలో చేపట్టిన సమర బేరి సైకిల్ యాత్ర శుక్రవారం మండల కేంద్రానికి చేరుకుంది. సైకిల్ యాత్రకు మండల ఎస్ఎఫ్ఐ నాయకుల పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షుడు రెడ్డమైన అరవింద్ మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులకు పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటీక్స్, స్కాలర్ షీప్స్ లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలలోని విద్యార్థులు డీగ్రీ కళాశాల ఏర్పాటుచేసి కేజీవీబీ విద్యాలయంలో ఇంటర్మీడీయట్ విద్యను ఆప్ గ్రేడ్ చేయాలని సూచించారు. నాయకులు తిప్పారపు శ్రీనివాస్, సాయి కృష్ణ, జిల్లా ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర నాయకులు పాల్గొన్నారు.