నవతెలంగాణ-హైదరాబాద్ : మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి, రూ. 59, 450 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గి, రూ. 54, 500 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం భారీగా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 77, 000 గా నమోదు అయింది.