ఎమ్మెల్యే మెచ్చా కు జీపీ కార్మికులు వినతి పత్రం అందజేత

నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ (జేఏసీ) కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో తొమ్మిదవ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా స్థానిక జీపీ కార్మిక సంఘం నాయకులు దమ్మపేట మండలం, తాటి సుబ్బన్న గూడెంలో గల తన స్వగృహంలో ఉన్న స్థానిక  శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పంచాయతీరాజ్ మంత్రి దృష్టికి  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జీపీ కార్మికుల  సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండల నాయకులు మట్లకుంట కామేశ్వరరావు, మూల అప్పన్న, కేసుపాక నరసింహారావు, కట్ట శ్రీనివాసరావు, ఉలవల మురళి, రాజపుత్ర రంజిత్ సింగ్, మద్దెల విజయకుమార్, వేలేటి నాగభూషణం, భవాని, రాము, వేల్పుల ముత్తారావు, మధు తదితరులు పాల్గొన్నారు
Spread the love