కేసీఆర్‌కు దమ్ముంటే

– ఈటల, అక్బరుద్దీన్‌పై పోటీ చేయాలి
– సీఎం కాళ్లు మొక్కి గౌరవం తగ్గించుకుంటున్న ఐఏఎస్‌లు : డీకే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీసీ అభ్యర్థిని కాదని కామారెడ్డిలో పోటీచేయడం తగదనీ, దమ్ముంటే ఈటల రాజేందర్‌, అక్బరుద్దీన్‌ ఓవైసీపై పోటీచేయాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ సవాల్‌ విసిరారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌ కేసును దారిమళ్లించేందుకే చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ కావాలని కవిత దొంగ దీక్ష చేశారని విమర్శించారు. నగరం నడిబొడ్డున మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు సీఎం క్యాంపు ఆఫీసులోని ఒక్క అధికారికి కూడా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోని అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందనీ, ఐఏఎస్‌ ఆఫీసర్లు సీఎం కాళ్లు మొక్కి తమ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని అధికారులకు సూచించారు. ప్రజాసేవ కంటే డబ్బు సంపాదన ముఖ్యమనే భావనను ఎమ్మెల్యేల్లో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. కార్పొరేట్లతో కుమ్మకై భూములను వారికి కట్టబెట్టి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఖరీదైన భూములను పార్టీ ఆఫీసుల పేరు మీద తక్కువకు కొట్టేశారని విమర్శించారు. ఖజానా నింపుకునేందుకు ముందస్తు మద్యం టెండర్లని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి మద్యం టెండర్ల మీద ఉన్న శ్రద్ధ విద్య, ఉద్యోగ నోటిఫికేషన్లపై ఎందుకు లేదని ప్రశ్నించారు. దళిత బంధును ఐదుగురు కార్యకర్తలు పంచుకుంటున్నారని తెలిపారు. ఆరోపణలున్న వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక తెగలకు చెందిన వారి ఐదు సీట్లను మాత్రమే మార్చి.. మిగతా వారిని కొనసాగించారని విమర్శించారు. బీసీలకు 22 సీట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ముదిరాజ్‌ సామాజిక తరగతికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. భుత్వాలు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.

Spread the love