క్రమం తప్పకుండా తీసుకుంటే…

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక్కో పండుకు కొన్ని కొన్ని సమస్యలను దూరం చేసే గుణం ఉంటుంది. అందులో చెప్పుకోదగినది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్‌ ఏ ఉంటుంది. దీనితో పాటు అనేక పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
– బొప్పాయి రక్త నాళాలలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా నిరోధిస్తుంది. ఇందులో పొటాషియం సమద్ధిగా ఉంటుంది. కనుక హదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
– కొవ్వును కరిగించడంలో బొప్పాయి సహాయపడుతుంది. తక్కువ కాలరీలున్న పండు కావడంతో బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
– తల్లిపాలను ఇచ్చే సమయంలో పండిన బొప్పాయి తినడం చాలా మంచి ఎంపిక. తాజా, పండిన బొప్పాయిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పలు ఇన్‌ఫెక్షన్‌లను నివారిస్తుంది.
– పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ బొప్పాయిలు ఎక్కువ లాక్టోజెనిక్‌, అందువల్ల పాలిచ్చే తల్లులు కచ్చితంగా ఆకుపచ్చ బొప్పాయిలను కలుపుకొని వేర్వేరు వంటకా లలో తినొచ్చు.
– బొప్పాయిలో మలబద్ధకాన్ని నివారించే డైటరీ ఫైబర్‌ ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు అద్భుతాలు చేస్తుంది. ఇది అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తుంది.