మీరు తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలతో పాటూ ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్, పప్పులు, గింజల వంటివి కూడా ఉంటాయా? అలా ఉంటే మీకు బైపోలార్ డిజార్డర్ రాదు. అలా కాకుండా… ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ బ్యాలెన్సింగ్ డైట్ తినకపోతే అలాంటి వారికి ఈ మానసిక సమస్య వస్తోంది. అసలు ఈ బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటో.. దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…
బైపోలార్ డిజార్డర్‌ను ఇదివరకు మానిక్ డిప్రెషన్ అనే వారు. ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉండే వారికి వస్తూ ఉంటుం ది. లేదంటే… ప్రేమించిన వాళ్లు దూరమైన, అయిన వాళ్లు చని పోయినా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నా, మత్తుపదార్థాలకు బానిసైనా అలాంటి వాళ్లు బైపోలార్ డిజార్డర్‌లోకి జారు కుంటారు. ఓ వైపు ఒత్తిడి, మరోవైపు కుంగుబాటుతనం రెండూ ఒకే సమయంలో వచ్చేవారికి ఈ బైపోలార్ డిజార్డర్ వస్తుంది.
లక్షణాలు ఇవే…
ఇది వచ్చినవాళ్లు తాము ఒంటరైపోయినట్టు ఫీలవుతారు. తమకు ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు భావిస్తారు. చీకట్లో కూర్చొని కుమిలిపోతారు. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకో వాలనుకుంటారు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ డిజార్డర్ వచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు.
పోగొట్టుకోవడం ఎలా?
ఈ సమస్య ఉన్న వాళ్లు దీన్ని పోగొట్టుకోవాలి. అలాగే లేని వాళ్లు ఇది రాకుండా చేసుకోవాలి. ఇందుకు మంచి ఆహారం తిన డమే సరైన మందు అంటున్నారు డాక్టర్లు. మంచి ఆహారం తీసు కునే వారికి ఈ మానసిక సమస్య రాదని తేల్చారు. ఈ సమస్య ఉన్న వారికి ప్రస్తుతం న్యూట్రాస్యూటికల్ ట్రీట్‌మెంట్ అనేది చేస్తున్నారు. అధిక బరువు ఉన్న వారు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే… ఈ సమస్య వచ్చిన వారిలో చాలా మంది అధిక బరువు కలిగివుంటున్నారంట.
ఇతర పనుల్లోకి జారుకోవాలి
మన శరీరానికి ఏ గాయమో అయితే వెంటనే తగ్గించ గలరు గానీ… మానసిక సమస్యలు, డిజార్డర్ల వంటివి ఉంటే మాత్రం వెంటనే తగ్గించలేరు. ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్ ఉన్నవారు ఒంటరితనాన్ని వదిలేయాలి. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వాళ్లతో మాట్లాడాలి. ఏదేదో అనుకుంటూ అదే పనిగా ఫీలవ్వడం మానేసి తమకు ఇష్టమైన ఇతర పనుల్లోకి జారుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒంటరి ఆలోచనలకు దూరం కావొచ్చు. రోజూ వ్యాయామం, వాకింగ్ వంటివి చెయ్యాలి. అదే సమయంలో మంచి ఆహారం తీసుకుంటే… మెదడు, శరీరం అన్నీ చక్కగా చురుగ్గా ఉంటూ బైపోలార్ డిజార్డర్‌ను దూరం చేస్తాయి.