చిన్న చిన్న పద్ధతుల్లో డబ్బు ఆదా చేయాలని అనుకుంటుంటాం. కానీ ఎలా చేయాలో తెలియదు. ఇక్కడ కొన్ని టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి.. చూడండి.
– తక్షణం అవసరం లేని వస్తువులని కొనకూడదు.
– అప్పు చేస్తే, తీర్చడానికే సరిపోతుంది, సేవ్ చేయడానికి ఏం మిగలదు.
– వారమంతా పక్కన పెట్టిన డబ్బులని వారాంతంలో బ్యాంక్‌లో వేసేయండి, ఆ ఎకౌంట్ నుండి అత్యవసరం అయితే తప్ప మనీ బయటకి తీయకూడదు అని రూల్ పెట్టుకోండి.
– అనుకోకుండా వచ్చిన బోనస్, అదనపు ఆదాయం లాంటి డబ్బులని ఎక్స్‌ట్రా ఎకౌంట్‌లో వేయండి.
– బయట తినడం తగ్గించి ఇంటి భోజనమే తీసుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకి ఆదా.
– బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కునే అలవాటు తగ్గించండి. మీతో పాటూ మంచినీరు తీసుకు వెళ్ళండి.
– అవసరం లేని వస్తువులని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో అమ్మేయండి.
– షాపింగ్ వెళ్ళినప్పుడు లిస్ట్ రాసుకుని, దాని ప్రకారమే కొనండి.
– వాడని సబ్‌స్క్రిప్షన్స్ ఉంటే, క్యాన్సిల్ చేయండి. కమోడిటీ యాప్స్‌ని అన్‌ఇన్‌స్ట్టాల్ చేసేయండి.
– వీలున్నంత వరకూ క్యాష్ పేమెంట్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయో మీకు తెలుస్తుంది.
– వారానికి ఒక రోజు ”నో మనీ స్పెండింగ్ డే” అని పెట్టుకుని ఆ రోజున ప్రాణావసరమయితే తప్ప ఎలాంటి ఖర్చూ పెట్టకండి.
– అన్నింటికంటే ముందు రోజుకి ఎంత ఖర్చు అవుతోందో ఒక లెక్క వేసుకోండి.
– లైబ్రరీల్లో పుస్తకాలు తీసుకోండి.. మీకు మరీ నచ్చితే తప్ప కొనకండి.
– ఊరికే సేవింగ్ చేయాలనుకుని సేవ్ చేయడం కాకుండా, మీ, మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సేవ్ చేయండి.
– ఏదైనా వస్తువు కొనే ముందు ఇంట్లో ఉన్నవి రీసైకిల్ చేయవచ్చేమో చూడండి.
– బాగా నచ్చిన వస్తువు కొనాలనిపిస్తే 24 గంటలు ఆగండి… ఆ తర్వాత కూడా ఆ వస్తువు ఇంకా నచ్చితే అప్పుడు కొనుక్కోండి.
– బయటకి వెళ్ళినప్పుడు ఒక కాఫీ తాగితే, ఇంటికొచ్చాక ఆ కాఫీకి అయిన ఖర్చు ఒక ఎకౌంట్‌లో వేయండి.
– వారానికి సరిపాడా మీల్ ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం వస్తువులు తెచ్చుకుంటే ఒక ఐడియా ఉంటుంది, అనవసరమైన ఖర్చు ఉండదు.
– పాడయిపోని వస్తువులని బల్క్‌లో తెచ్చుకోండి, కొంచెం డబ్బులు కలిసి వస్తాయి.
– బేసిక్ టైలరింగ్ నేర్చుకుంటే తెలియని ఖర్చు తగ్గుతుంది.
– వీలున్నంత వరకూ గిఫ్ట్స్ ఇంట్లో తయారు చేయవచ్చేమో చూడండి.. లేదు కొనాలి అంటే ముందే కొనండి, లాస్ట్ మినిట్ షాపింగ్‌లో ఎప్పుడూ ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.