పద్దెనిమిది నిమిషాల్లో…

Sleeping in 18 minutsప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్య సమస్య నిద్రలేమి. చాలా మంది తమకు నిద్ర పట్టట్లేదంటూ బాధపడుతుంటారు. కొందరైతే నిద్రమాత్రలు వాడుతున్నామంటారు. ఇది ప్రమాదకరం. నిద్రలేమి అనే మానసిక సమస్య ఇప్పుడు ప్రపంచమంతా ఉంది. దీనికి కారణం అనేక రకాలఒత్తిళ్లు, టెన్షన్లు, శారీరక అలసట, సోషల్‌ మీడియా గాసిప్‌లు, రణగొణ ధ్వనులు… ఇలా ఎన్నో అంశాలు మన నిద్రను చెడగొడుతున్నాయి.అయితే కొన్ని చిట్కాలకు పాటిస్తే ఎవరైనా సరే బెడ్‌ ఎక్కిన 18 నిమిషాల్లో నిద్రపోవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు. అదెలాగో మనమూ తెలుసుకుందాం.
నిద్రపోవడానికి నిద్రమాత్రలకు ఒక్కసారి అలవాటైతే… ఇక ప్రతిసారీ వేసుకునేలా చేస్తాయి. అందుకే సైకాలజిస్టులు నిద్ర కోసం టాబ్లెట్లు వాడమని ఎప్పుడూ చెప్పరు. తాజాగా ప్రముఖ జర్నల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ సైకాలజీలో ఎలా నిద్రపోవాలో సలహా ఇచ్చారు. ఈ అధ్యయనాన్ని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ బేలార్‌లో 56 మంది సైకాలజీ ప్రొఫెసర్లు నిర్వహించారు. 57 మందిని రెండు గ్రూపులుగా విభజించారు. ఓ గ్రూపును… నిద్రపోయే ముందు తాము ఆ రోజు ఏం చేసిందీ ఓ బుక్కులో రాయమన్నారు. మరో టీమ్‌ని వాళ్లు తర్వాత రోజు ఏం చేయాలనుకుంటున్నారో ఓ బుక్కులో రాయమన్నారు.
ఈ పరిశోధనలో… ఆ రోజు ఏం చేసిందీ రాయమన్న వారు ఆలస్యంగా నిద్ర పోతున్నారు. తర్వాత రోజు ఏం చేయాలో రాయాలనుకున్నవారు వెంటనే నిద్రలోకి జారిపోతున్నారు. ఇలా ఎందుకంటే ఏదైనా జరగబోయేది ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా నరాలు రిలాక్స్‌ అవుతూ నిద్రలోకి జారిపోతారట. ఇకపై నిద్రపట్టని వాళ్లు ఇది ఫాలో అయిపోతే సరి అంటున్నారు సైకాలజిస్టులు.