మానవత్వం చచ్చిపోయింది
విలువలకు వలువలు విప్పిన విషనాగులు
నా దేశ గౌరవాన్ని నడిరోడ్డులో
నగంగా ఊరేగిస్తూ
దేవతలు నడయాడే చోటుని
పట్టపగలే నట్టనడి వీధుల్లో
కామంధుల చెరలో నా దేశం నలిగిపోతోంది
ఇక్కడ ఇలాంటి సంఘటనలు
నిత్యం బహుజనులపై జరగడం పరిపాటే
కళ్ళుండీ చూడలేని ఏలికలున్నంత కాలం
కింది వాడెప్పుడు గాయ పడుతుండాలి
ఉన్నతులకేదైనా జరిగితే
ఎన్‌కౌంటర్లతో నూకలు చెల్లించి
శభాషనిపించుకుంటారిక్కడ
మనువాదమే ఇక్కడొక సమాంతరరేఖ
బహుజనులే గులాములై సలాం కొడుతుంటే
సిగ్గులేని జీవన గమనం
బయటకు రాని ఊరేగింపులెన్నో
(మణిపూర్ సంఘటనకు నిరసనగా)
– సి. శేఖర్ (సియస్సార్), 9010480557