7న వేద సాయిచంద్‌ స్మారక సంచిక ఆవిష్కరణ

వేద సాయిచంద్‌ యాదిలో ‘జయంతి పత్రిక’ ప్రచురించిన స్మారక సంచిక ఆవిష్కరణ సభ ఆగష్టు 7 సోమవారం సాయంత్రం 5:30 గం||లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించనున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీశ్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్మారక సంచికను ఆవిష్కరిస్తారు. డా.వెలిచాల కొండలరావు అధ్యక్షత వహించే ఈ సభలో దేశపతి శ్రీనివాస్‌, రజినీ సాయిచంద్‌, మామిడి హరికష్ణ, ఆచార్య కె యాదగిరి, డా.కోయి కోటేశ్వరరావు, యశ్‌ పాల్‌, ఎర్రోజు శ్రీనివాస్‌ పాల్గొంటారు.
– విశ్వనాథ సాహిత్య పీఠం, తెలంగాణ వికాస సమితి