రేపే భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్

నవతెలంగాణ హైదరాబాద్: వన్డే ప్రపంచ కప్‌ 2023 (ODI World Cup 2023) సెమీస్‌ దశకు చేరింది. లీగ్‌ దశలలో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్‌ అగ్రస్థానంతో సగర్వంగా సెమీస్‌కు వెళ్లింది. రేపు తొలి సెమీ ఫైనల్ భారత్ – న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ను మరోసారి సొంతం చేసుకోవాలన్న కసితో ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఏడుసార్లు భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. మూడుసార్లు విజేతగా నిలిచింది.

Spread the love