12న స్ఫూర్తి పురస్కారాలు

వసుంధర విజ్ఞాన వికాస మండలి 30 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో సేవలందిస్తున్న కొంతమందికి స్ఫూర్తి పురస్కరాలను అందించనున్నారు. ఈ నెల 12న రవీంధ్రభారతిలో నిర్వహించే వార్షికోత్సవంలో ఈ పురస్కరాలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక మోహన్‌, వారాల ఆనంద్‌, భళ్లమూడి రాంప్రసాద్‌, మేజిక్‌ రాజా, దేవి లక్ష్మినర్సయ్య, డాక్టర్‌ రాయినవేన రమేశ్‌, దాస లక్ష్మి, గుడికందుల భూమయ్య, అరికెపూడి రఘు, గోపాల్‌రెడ్డి, పొరెడ్డి అశోక్‌, బేబీ సంహిత, ఆకుల శ్రీధర్‌, మాల్యల శ్రీనివాస్‌ పురస్కారాలు అందుకోనున్నారు.