‘మహిళా సాధికారత’ సాధ్యమేనా?

Is 'Women's Empowerment' Possible?”ఆకాశంలో సగం-అవనిలో సగం” అవకా శాల కోసం ఏండ్ల తరబడి ఎన్నో నినాదాలు ఇస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా మహిళలు ఈ 21వ శతాబ్దంలోనూ అన్యాయాన్ని, వివక్షను ఎదు ర్కొంటూనే ఉన్నారు. ఉద్యమ నాయకత్వంలోనూ, దక్షతల్లోనూ, రాజకీయరంగంలోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ ఇలా ఏకకాలంలో ఎన్నో బాధ్య తలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే వ్యక్తిత్వ హననానికి పాల్పడే కురుచ ‘జీవులకు’ ధీటుగా సత్తా చాటిన, చాటుతున్న మహిళా శిరోమణులు ‘టార్చ్‌ బేరర్లు’ మనకు ఎందరో ఉన్నా ప్రయా ణించాల్సిన దూరం ఇంకా చాలానే ఉంది. దీని కోసం మహిళలు మాత్రమే కాకుండా పురుష ప్రపంచం కూడా చాలా శ్రమించాల్సి ఉంది. చట్ట సభల్లో (పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు) మహిళలకు రిజర్వేషన్లలను కల్పిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లును తెచ్చి ఆమోదించిన ఈ తరుణంలో మహిళలకు చట్టసభల్లో ఇప్పుడున్న అవకాశాలు, కొత్తగా ఈ చట్టం అమలుకు కసరత్తు శరవేగంగానే జరిగిది. రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేసింది. మంచి విషయమే కానీ… ఈ చట్ట బద్ధ హక్కుల కోసం ఉద్యమించిన వారెవరు, భవి ష్యత్తులో ఎలాంటి వ్యూహాన్ని మహిళాలోకం అను సరించాలనేది కచ్చితంగా చర్చనీయాంశమే. ఇప్పుడు బిల్లును ఆమోదించి, ఏదో సాధించి నట్టు గా గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు, వెంటనే అమలు చేయడానికి ఎందుకు పూనుకోవడం లేదో చెప్పడం లేదు. ఇప్పటికే మహి ళలు ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో సమర్థ తను ప్రదర్శిస్తున్నా అవకాశాలకోసం ఇంకా ఎందుకు వేచిచూడాలి? మహిళలకు చట్టసభల్లో అవకా శాలను కల్పించే విధంగా ఉన్న అన్ని అవ కాశాలను ఎవరి ప్రయోజనాల కోసం కాలదన్ను తున్నారనేది భారతావని మహిళలకు అర్థం కాదని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారేమో. జాతీయ వ్యాప్తంగా కోల్పోతున్న బీజేపీ ప్రతిష్టను, మహిళల ఓట్లను కొల్ల గొట్టాలనే ఆశలు తప్ప, మహిళలకు చట్ట సభల్లో అవకాశాల ద్వారా సాధికారతను కల్పిం చడానికి చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవు తోంది. ఏదో చేసినట్టుగా మహిళల దష్టిని ఆక ర్షించి, ఓట్లను దండుకోవాలనే యావతప్ప మహి ళలను మహారాణులను చేయాలనే కోరిక బీజేపీ పాలకు లకు లేదని ఈ చట్టం అమలుకు షరతు లను విధించడం ద్వారా వారే చెప్పుకున్నారు.
ఇంకో పదేళ్ల తర్వాత అమలయ్యేదానికి ఇప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి, బిల్లును ఆమోదించడంలో ప్రయోజనమేంటో భారత మహిళాలోకానికి చాలా స్పష్టంగా అర్థమ వుతోంది. పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుతో వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లను కొనుగోలు చేయాలనే దురుద్దే శాన్ని మహిళలు సంపూర్ణంగా అర్థం చేసుకు న్నారు. మహిళల శక్తి సామర్థ్యాల గురించి నోటితో పొగుడుతూ మాట్లాడేవాళ్లు, ఆచరణలో అవకాశా లను కల్పించడంలో మొండిచేయిని చూపిస్తు న్నారు. పురుషులు అండలేకుండా, మహిళలు రాణించలేరనే పురుషాధిక్య భావజాలం, సనాతన చాందస భావజాలపు సాలెగూడు నుంచి బయ టకు తీసుకురావడంలో రాజకీయ చైతన్యవాదులు ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రజా స్వామిక ప్రభుత్వాలు ఏర్పాటు కాకముందే మహిళ లెందరో తెగించి, యుద్ధభూమిలో పోరాడి రాజ్యాన్ని సాధించుకున్నారు. ‘రాజ్యం వీరభోజ్యం’ అనే కాలం లోనూ రాణి రుద్రమదేవి వంటి వారెం దరో తమ ప్రతిభాపాట వాలను ప్రదర్శించారు. పురాణేతి హాసాల్లోనూ ధైర్య, శౌర్య ప్రతాపా లను చూపించి నవారున్నారు. కానీ నాగ రికత పెరుగుతున్నదని ఢంబా చారం ప్రదర్శిస్తున్న నవీనకాలంలోనూ మహిళలను ఇంకా వంటింటికి పరి మితం చేయాలనే కుయు క్తులు అమలు చేస్తూనే ఉండటం బాధా కరం. వంటింటిని దాటి అంతరిక్షం దాకా మహిళలు ప్రయాణించడంలో ఎన్నో అవాంతరాలను మహిళలు దాటాల్సి వస్తోంది. గత శతాబ్ద కాలం లో మహిళామణులు కొందరు ఇలాం టి అవరోధాలను దాటి ప్రపంచ దేశా ల్లో తమ ప్రతిభాపాటవాలు, శక్తిసామ ర్థ్యాలతో దేశాలకు నాయకత్వం వహించే స్థాయి దాకా చేరుకున్నారు. మహిళల హక్కుల కోసం, చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాడిన మహిళలు చాలామంది ఉన్నారు. న్యూజిలాండ్‌ దేశంలో 19వ శతాబ్దం లోనే మహిళలకు చట్టసభల్లో సమానభాగం కావా ల్సిందేనంటూ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం క్రమంగా ఐరోపా, అమెరికా, బ్రిటీషు, బ్రిటీషు వలసదేశాల్లోనూ ఆవరించింది. అమెరికా ఉమెన్‌ క్రిస్టియన్‌ టెఫరెన్స్‌ యూనియన్‌ అనే ఆర్గ నైజేషన్‌ సారథ్యంలో న్యూజిలాండ్‌ శాఖ ఆ దేశంలోని మహిళా హక్కులకోసం తీవ్రమైన పోరు సల్పింది. ఆంగ్ల భాషాసాహితీవేత్త జాన్‌ స్టూవర్ట్‌మిల్‌ రచ నలు ఈ మహిళా ఉద్యమానికి ఉత్తేజాన్ని కల్పిం చాయి. న్యూజిలాండ్‌ దేశంలో జరిగిన ఈ మహిళా హక్కుల కోసం జరిగిన ఉద్యమానికి కాటె షఫర్డ్‌ నాయకత్వం వహించారు. ఆ దేశ ప్రధాని రిచర్డ్‌ సెడాన్‌ ఈ మహిళా బిల్లును వ్యతిరేకించినా రెండు ఓట్ల మెజారిటీతో (20-18) చట్టంగా మా రింది. అమెరికా దేశంలోని వైయమింగ్‌, ఉటాఫ్‌ రాష్ట్రాలు కూడా 1869, 1870ల్లోనే చట్టాలు చేశాయి. వీటితో పాటు 1907లోనే ఫిన్లాండ్‌, 1917లో కెనడా, 1918లో బ్రిటీషు, 1920లో అమెరికా దేశాలు మహిళలకు ఓటుహక్కును కల్పి స్తూ చట్టా లను చేశాయి. అయినా చాలా ప్రపంచ దేశాల్లో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులే కావడం నాగరిక సమాజం సిగ్గు పడాల్సిన విషయం.
మన దేశంలోని చట్టసభల్లో మహిళలకు అవ కాశాల కోసం పోరాడిన మహిళానేతలూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్క చెంది గీతా ముఖర్జీ (గీతా దీ) మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని చాలా ఏండ్లు పోరాటం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతా ముఖర్జీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావా లంటూ అనేక పోరాటాలు చేశారు. ఈ మహిళా బిల్లును ఆమోదించాలంటూ 27 ఏండ్ల కింద పార్ల మెంటులో ప్రవేశ పెట్టినప్పుడు జాయింట్‌ పార్ల మెంటరీ కమిటీకి చైర్ప ర్సన్‌ గీతాముఖర్జీ ఉన్నారు. ఇలాంటి మహిళా నేతలు చాలామంది ఉన్నారు. అలా పోరాటం చేసిన వారిలో చాలా మంది ఇప్పుడులేకున్నా, వారి పోరాట ఫలాలు భావి తరా లకు అందకుండా ఉంటాయా? కాకుంటే ఇప్పుడు ఆమోదించిన బిల్లును, మరెప్పుడో అమలు చేస్తా మని దాటవేయడం మహిళలకు ఆశలు చూపించి, ఓట్లను దండుకునే బీజేపీ ఎత్తుగడను దేశ మహిళలు అర్థం చేసు కుంటున్నారు. మహిళలకు సాధికారత, మహిళలకు నాయకత్వం అందించడం కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సాధ్యమనేది రాజ కీయాలకు అతీతంగా అందరూ గుర్తిస్తు న్నారు. ఉక్కుమహిళగా పిలువబడి, భారత ప్రధానమంత్రిగానే ప్రాణాలను అర్పించిన ఇందిరా గాంధీని దళిత వాడల్లో, గిరిజన తాండాల్లో ఇప్ప టికీ స్మరించుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షే మాన్ని మాత్రమే అమలు చేసిన మహి ళగా కాకుండా పురుషాధిక్యపు రాజకీయ ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేయడంలోనూ, పొరుగు దేశాలను కట్టడిచేసి భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాల్లో కీర్తి పతాకను ఎగుర వేయడంలోనూ ఇందిరమ్మ చూపించిన ధీర, శౌర్య ప్రతాపాలను దేశ మహిళలంతా ఆదర్శంగా తీసుకుని, అను సరించాల్సిందే. స్థానిక సంస్థల్లో మహి ళలకు రిజర్వేషన్ల కోసం 1987లో రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించిన చరిత్ర కూడా రాజీవ్‌ గాంధీ ప్రధానిగా సాధించినదే. ఈరోజు దేశంలోని అన్ని స్థానిక సంస్థల్లో మహిళలకు నాయకత్వ అవకాశాలు కాంగ్రెెస్‌ పార్టీ తెచ్చిన ఈ చట్టం ద్వారానే సంక్రమించిన విషయాన్ని ఎవరైనా కాదనగలరా? తెలంగాణ ఏర్పాటు చేయడంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియమ్మ చూపించిన తెగువ, త్యాగం కూడా ఇందిరమ్మ వారసురాలిగా తెలంగాణ ప్రజలకు ‘అమ్మ’ నిలిచింది. ఇలాంటి మహిళానేతలు, ఆదర్శమూర్తులు, త్యాగధనులైన తల్లుల వారసత్వంలో దేశ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లి దేశకీర్తి మకుటంలో నిలుస్తారనే విషయంలో ఎవరికీ తెలంగాణలో సందేహం లేదు.
లిక్కర్‌ దందాలో ఇరికిపోయి, తప్పించుకునే మార్గం కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డం పెట్టుకున్న కల్వకుంట్ల కవిత నిర్వాకంతో తెలం గాణ మహిళలకు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. ఈ దందాలో 33 శాతం కోసం ఢిల్లీ వీధుల్లో తెలం గాణ మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆమె ఏదో సాధించినట్టు ఫోజులు కొట్టడం హాస్యా స్పదం. ఒక తెలంగాణ మహిళగా లిక్కర్‌ దందాలో కవిత నిండా మునిగిపోవడంతో దేశమంతా ముక్కున వేలేసుకుంది. ఈ కవిత లాంటి వారె ప్పుడూ తెలంగాణ వారసత్వాన్ని అందుకోలేరు. నిజంగానే కవితకు మహిళల మీద ప్రేమ ఉంటే బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) టికెట్ల జాబితాలో 33 శాతం రిజర్వేషన్లు కావాలని, ఆమె తండ్రి చంద్ర శేఖర్‌రావు ఇంటిముందు భైఠాయించి ఉండేది. దీనికి ఏ చట్టం అడ్డువచ్చింది? మహిళలకు బీఆర్‌ఎస్‌ టికెట్లలో 33 శాతంకోసం కొట్లాడి, ఏదో సాధించినట్టుగా చెప్పుకుంటున్న కవితను తెలంగాణ సమాజం ఎప్పటికీ ఆమోదించదు. తెలంగాణలో చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి వీరవనితల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారెందరో ఉన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఈ వీరవనితలే ఆదర్శం. వారి బాటలోనే తెలంగాణ మహిళాలోకం కీర్తి ప్రతిష్ఠలను దేశానికి చాటించి తీరుతుంది.
బండ్రు శోభారాణి
9866077399

Spread the love
Latest updates news (2024-05-14 13:07):

does anger raise 7Yh blood sugar | tea for lowering blood sugar MYN | low blood sugar cookbook 0rq sugarless cooking for everyone | Ip8 blood sugar spike vomiting | medication to reduce high blood sugar l5h | he moglobin a1c and 2DO average blood sugar level | cinnamon pills to RQi lower blood sugar | oats increases WXW blood sugar | spike free trial blood sugar | can massage lower jRj blood sugar | good blood sugar levels for women dEm | high low price blood suger | does ribose JYi help medicated diabetics with high blood sugar | how does a 3 month blood jY7 sugar test work | will nNJ magnesium bring blood sugar down | heroins effect on blood sugar grp | does meloxicam affect blood sugar SB1 | low blood sugar after having too much ycz sugar | blood sugar in BkC 40s | low blood sugar diarrhea AWH nausea | 3xz lower blood sugar meal prep | why might someone have slightly elevated 2Kr blood sugar | diabetic fasting blood 1xA sugar elevated | can terbinafine FXu raise blood sugar | blood sugar doctor recommended 229 | can iron raise blood sugar s8H | can gbP heat increase blood sugar | blood sugar eWd 158 in morning | Xaw tremor with normal blood sugar | low blood sugar and lupus UOe | blood 2M5 sugar testing news | BBG drop in blood sugar after eating | does sleep apnea raise blood sugar 691 | can poK baking soda raise blood sugar | what is considered low blood sugar pregnant 8Pw | low blood sugar p7q in toddlers causes | is 97 blood sugar hAf low | can protonix mSU elevate blood sugar | can sugar substitutes raise blood vQH sugar levels | does inulin Lti lower blood sugar | which combination of foods may help xA8 regulate blood sugar | my blood sugar won t go down type 2 pS8 | g01 can type 2 diabetes reduce blood sugar levels | taking blood sugar NXn after exercise | OTg arazo blood sugar support side effects | would low blood sugar cause IMX vomiting | blood sugar 318 coO before eating | do hydrocodone raise Mwk blood sugar | foods that reduce blood sugar nT5 level | iF8 high blood sugar diet fruits